Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గెలుపే లక్ష్యం.. వలస ఓటర్లే టార్గెట్.. పల్లెల్లో కొత్త రాజకీయ వ్యూహాలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గెలుపే లక్ష్యం.. వలస ఓటర్లే టార్గెట్.. పల్లెల్లో కొత్త రాజకీయ వ్యూహాలు!

వార్త ముఖ్యాంశాలు

  • సింహపురి పల్లెల్లో పంచాయతీ పోరు..
  • వలస ఓటర్లపై అభ్యర్థుల గురి!
  • **నెల్లూరు:** జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతోంది.

సింహపురి పల్లెల్లో పంచాయతీ పోరు.. వలస ఓటర్లపై అభ్యర్థుల గురి!

**నెల్లూరు:** జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతోంది. మూడు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారడంతో అభ్యర్థులు గెలుపు కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాల నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వలస వెళ్లిన కార్మికులను ఓటింగ్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

వలస ఓటర్లకు ఫోన్లు చేసి స్వగ్రామాలకు రావాలని కోరుతూ, ప్రయాణ ఖర్చులు భరిస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన చోట ప్రత్యేక బస్సుల ఏర్పాట్లకూ సిద్ధమవుతున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగకపోయినా ప్రధాన పార్టీల మద్దతుదారులు తెరవెనుక పావులు కదుపుతున్నారు. పోలింగ్ సమీపిస్తుండటంతో వలస ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ గ్రామాల్లో నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *