నిడదవోలు, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): గురు పౌర్ణమి సందర్భంగా నిడదవోలులో బీజేపీ ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ మద్దిపాటి రజని, బీజేపీ బీఎల్ఏ–1 సత్యనారాయణ నివాళులర్పించారు. అనంతరం గురు పౌర్ణమి సందర్భంగా దత్త పీఠాధిపతి సురేష్ శాస్త్రిని నాయకులు ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మికత, గురువుల ప్రాధాన్యతను నాయకులు వివరించారు. కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



