Friday, 5 June 2026
  • Home  
  • గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో గ్రామసభ ఘనంగా నిర్వహణ*
- ఖమ్మం

గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో గ్రామసభ ఘనంగా నిర్వహణ*

*గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో గ్రామసభ ఘనంగా నిర్వహణ* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 05గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: గార్ల ఒడ్డు గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ భూక్యా నర్సి లాలూ నాయక్ అధ్యక్షత వహించారు. ఉప సర్పంచ్ శివలంకి వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి వార్డ్ నెంబర్లు, గ్రామ పెద్దలు భూక్యా లాలు అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామసభలో గ్రామ అభివృద్ధి పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై చర్చించారు. గ్రామస్తుల సూచనలు, సమస్యలను సర్పంచ్ నర్సి లాలూ నాయక్ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామసభ అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ నర్సి లాలూ నాయక్ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు మొక్కలు నాటి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు ప్రజారోగ్యం, పోషకాహారం, మహిళా సంక్షేమంపై అవగాహన కల్పించారు. గ్రామసభ విజయవంతంగా నిర్వహించడంలో పంచాయతీ సిబ్బంది కృషి చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.

*గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో గ్రామసభ ఘనంగా నిర్వహణ*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 05గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:

గార్ల ఒడ్డు గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ భూక్యా నర్సి లాలూ నాయక్ అధ్యక్షత వహించారు.
ఉప సర్పంచ్ శివలంకి వెంకటేశ్వర్లు
పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి వార్డ్ నెంబర్లు, గ్రామ పెద్దలు భూక్యా లాలు అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామసభలో గ్రామ అభివృద్ధి పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై చర్చించారు. గ్రామస్తుల సూచనలు, సమస్యలను సర్పంచ్ నర్సి లాలూ నాయక్ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామసభ అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ నర్సి లాలూ నాయక్ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు మొక్కలు నాటి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు ప్రజారోగ్యం, పోషకాహారం, మహిళా సంక్షేమంపై అవగాహన కల్పించారు.

గ్రామసభ విజయవంతంగా నిర్వహించడంలో పంచాయతీ సిబ్బంది కృషి చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.