ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో మామిళ్ళపల్లి రవీంద్ర బాబు కుమారుడు మామిళ్ళపల్లి అనిల్ వివాహ నలుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు గూటూరు మురళీ కన్నబాబు హాజరై నూతన వరుడిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఏనుగంటి నాగయ్య చౌదరి, మామిళ్ళపల్లి జనార్దన్ నాయుడు, తలచిరు సుబ్బరాయుడు, పచ్చా వెంగయ్య నాయుడు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఆనందోత్సాహాలతో వేడుకను నిర్వహించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.



