ఖమ్మం: సుమారు 4 లక్షల జనాభా కలిగిన ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ) పరిధిలో ఖాళీ స్థలాల పన్ను (VLT) వసూళ్లపై అధికారుల దృష్టి కొరవడటంతో ఆదాయానికి గండి పడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని 50 డివిజన్లలో వేలాది ఓపెన్ ప్లాట్లు ఉన్నప్పటికీ, పలువురు యజమానులు ఖాళీ స్థలాల పన్ను అసెస్మెంట్ చేయించుకోలేదని సమాచారం. దీంతో మున్సిపల్ ఆదాయానికి నష్టం వాటిల్లుతున్నట్లు చర్చ జరుగుతోంది. మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో ఖాళీ స్థలాల వివరాలను సేకరించి, పన్ను పరిధిలోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తే ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.



