ఖానాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ (PACS) ఆధ్వర్యంలో మండలంలోని రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖానాపురం PACS చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్, నర్సంపేట AMC వైస్ చైర్మన్ మరియు ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు పాల్గొని ఖానాపురం మండల కేంద్రంతో పాటు మనుబోతులగడ్డ, అశోక్ నగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో PACS డైరెక్టర్లు దేవినేని వేణుగోపాలరావు, లింగడి వెంకటేశ్వర్లు, బాలుగు లక్ష్మణ్, మర్రి ప్రభాకర్, బిచ్చ నాయక్, శివరాత్రి వెంకన్న, పెండ్లి రజిత, భాషబోయిన రవి యాదవ్, బండి వెంకన్న, AMC డైరెక్టర్ గట్టి సారంగపాణి, అశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుతం,మనుబోతుల గడ్డ సర్పంచ్ శ్రీలత-అశోక్, వివిధ గ్రామాల వార్డు సభ్యులు, మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్