ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ విజయవంతమైంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీకి జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కొండపల్లి శ్రీధర్ రెడ్డి, సన్నే ఉదయ్ ప్రతాప్, నున్న రవికుమార్, భూక్యా శ్యాం సుందర్ నాయక్, వేల్పుల సుధాకర్, సాయిరామ్, పమ్మి అనిత, మంద సరస్వతి, శ్రీరామనేని మణి, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



