*గ్రామీణ ప్రాంతాల్లో యువతలోని క్రీడాశక్తిని, క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకే ఈ ఖేల్ మహోత్సవం:: ఎంపీ.డీకే అరుణ*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 25/04/2026*
*గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీసి వారిని అంతర్జాతీయ స్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి ఖేల్ సంసద్ దోహదం చేస్తుందని పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ పేర్కొన్నారు ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు మోడీగారి చొరవతో ఇటీవల అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలిచిందని ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీలకు యువత నుంచి విశేషమైన స్పందన లభించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీవర్దన్ రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్ రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెకర్ అనిత, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్త మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిష పూజిత, యాంకర్ గాయత్రి భార్గవి, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ , వైష్ణవి డాన్స్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు విజయలక్ష్మి నృత్యకారిణి, తదితరులు పాల్గొన్నారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడారు*


