నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో 80,170 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లను కలసి సత్కరించారు .మేయర్ ఎన్నికల్లో తన విజయానికి సహకరించినందుకు రూప్ కుమార్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో అందించిన సహకారం, ప్రోత్సాహం మరువలేనివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి సోదరులను శాలువాలతో సన్మానించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికల విజయానంతరం జరిగిన ఈ ఆత్మీయ కలయికలో నాయకుల మధ్య పరస్పర అభినందనలు వెల్లువెత్తాయి. నగరాభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగాలని కోటంరెడ్డి సోదరులు ఆకాంక్షించారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్