Wednesday, 1 July 2026
  • Home  
  • కేతిగుంటలో చెత్త సంపద తయారీ కేంద్రం ఆక్రమణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కేతిగుంటలో చెత్త సంపద తయారీ కేంద్రం ఆక్రమణ

*రాత్రికి రాత్రే ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన అక్రమార్కులు.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్* *మర్రిపాడు:* మర్రిపాడు మండలం కేతిగుంట గ్రామంలో ప్రభుత్వానికి చెందిన చెత్త సంపద తయారీ కేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారు.సోమవారం రాత్రికి రాత్రే కేంద్రం చుట్టూ ఫెన్సింగ్ రాళ్లు నాటి, ఇనుప కంచె ఏర్పాటు చేసి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన చెత్త సంపద తయారీ కేంద్రాన్ని ఈ విధంగా ఆక్రమించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కొందరు బహిరంగంగానే ఆక్రమిస్తున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆక్రమణపై రెవెన్యూ, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని పరిశీలించాలని, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

*రాత్రికి రాత్రే ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన అక్రమార్కులు.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్*

*మర్రిపాడు:* మర్రిపాడు మండలం కేతిగుంట గ్రామంలో ప్రభుత్వానికి చెందిన చెత్త సంపద తయారీ కేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారు.సోమవారం రాత్రికి రాత్రే కేంద్రం చుట్టూ ఫెన్సింగ్ రాళ్లు నాటి, ఇనుప కంచె ఏర్పాటు చేసి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన చెత్త సంపద తయారీ కేంద్రాన్ని ఈ విధంగా ఆక్రమించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కొందరు బహిరంగంగానే ఆక్రమిస్తున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆక్రమణపై రెవెన్యూ, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని పరిశీలించాలని, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.