Thursday, 10 September 2026
  • Home  
  • కేజీబీవీ ఆనందపరంలో అంగరంగ వైభవంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- విశాఖపట్నం

కేజీబీవీ ఆనందపరంలో అంగరంగ వైభవంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 15 ఆనందపురం: మండలంలోని నేలతెరు గ్రామం, లోడగలవానిపాలెం పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి దొండా చంద్రకళ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోరుకొండ శివాజీ గారు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశిష్ట అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి శారదా ప్రియాంక గారు పాల్గొన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు రౌతు శ్యామల, యువ నాయకులు, ప్రముఖ సంగీత దర్శకులు బమ్మిడి తారక్, ప్రజా సంకల్ప వేదిక జాతీయ ఉపాధ్యక్షులు బంగార్రాజు, వైస్ చైర్మన్ శ్రీమతి ఓ. మంగ, ఓ. అప్పన్న, మేము సైతం వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిరెడ్డి దేముడు బాబు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ప్రదర్శించి వీక్షకులను ఆకట్టుకున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విశిష్ట అతిథి సందేశం – విద్యార్థులకు స్ఫూర్తిదాయక పిలుపు శ్రీమతి శారదా ప్రియాంక గారు మాట్లాడుతూ: “స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను విద్యార్థులు ఎప్పటికీ మరచిపోకూడదు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఆడపిల్లలకు విద్యే గొప్ప బలం. ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తల్లిదండ్రులకు, పాఠశాలకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని హృదయాల్లో నింపుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తూ కేజీబీవీ ఆనందపురంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. Uploaded Video:

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 15 ఆనందపురం: మండలంలోని నేలతెరు గ్రామం, లోడగలవానిపాలెం పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి దొండా చంద్రకళ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోరుకొండ శివాజీ గారు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విశిష్ట అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి శారదా ప్రియాంక గారు పాల్గొన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు రౌతు శ్యామల, యువ నాయకులు, ప్రముఖ సంగీత దర్శకులు బమ్మిడి తారక్, ప్రజా సంకల్ప వేదిక జాతీయ ఉపాధ్యక్షులు బంగార్రాజు, వైస్ చైర్మన్ శ్రీమతి ఓ. మంగ, ఓ. అప్పన్న, మేము సైతం వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిరెడ్డి దేముడు బాబు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ప్రదర్శించి వీక్షకులను ఆకట్టుకున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

విశిష్ట అతిథి సందేశం – విద్యార్థులకు స్ఫూర్తిదాయక పిలుపు

శ్రీమతి శారదా ప్రియాంక గారు మాట్లాడుతూ:
“స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను విద్యార్థులు ఎప్పటికీ మరచిపోకూడదు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఆడపిల్లలకు విద్యే గొప్ప బలం. ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తల్లిదండ్రులకు, పాఠశాలకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు.

దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని హృదయాల్లో నింపుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తూ కేజీబీవీ ఆనందపురంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.