Wednesday, 16 September 2026
  • Home  
  • కృష్ణంపాలెం ప్రజల విజ్ఞప్తిపై తక్షణ స్పందన…
- ఆంధ్రప్రదేశ్

కృష్ణంపాలెం ప్రజల విజ్ఞప్తిపై తక్షణ స్పందన…

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కృష్ణంపాలెం, పునరావాస కాలనీ ప్రజలు కాలుష్య సమస్యపై చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ సంస్థలో తనిఖీలు చేపట్టారు. పరిశ్రమలో యంత్రాల ట్రయల్ రన్ సందర్భంగా కాలుష్య వాయువులు సమీప ప్రాంతాల వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులో ఉన్న చిమ్నీ ద్వారా మాత్రమే విడుదల చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలుష్య నియంత్రణ చర్యలు పూర్తయ్యే వరకు కమిషనింగ్ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేయడం ద్వారా ప్రజల విజ్ఞప్తికి తక్షణ పరిష్కారం లభించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.