Thursday, 2 July 2026
  • Home  
  • కూర్మన్నపాలెంలో అదుపుతప్పి కారు బోల్తా మహిళ మృతి.. నలుగురికి గాయాలు
- విశాఖపట్నం

కూర్మన్నపాలెంలో అదుపుతప్పి కారు బోల్తా మహిళ మృతి.. నలుగురికి గాయాలు

గాజువాక, జులై 2 (పున్నమి ప్రతినిధి): కూర్మన్నపాలెం సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అనకాపల్లి వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న గోతిలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మంగ (48) అక్కడికక్కడే మృతి చెందగా, కుసుమ (46) తీవ్రంగా గాయపడింది. విజయలక్ష్మి (56), తాన్వి (7) స్వల్ప గాయాలతో బయటపడగా, కారు డ్రైవర్ బాల మురళీకృష్ణ కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లిలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గాజువాక, జులై 2 (పున్నమి ప్రతినిధి): కూర్మన్నపాలెం సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అనకాపల్లి వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న గోతిలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మంగ (48) అక్కడికక్కడే మృతి చెందగా, కుసుమ (46) తీవ్రంగా గాయపడింది. విజయలక్ష్మి (56), తాన్వి (7) స్వల్ప గాయాలతో బయటపడగా, కారు డ్రైవర్ బాల మురళీకృష్ణ కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
అనకాపల్లిలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.