కావలి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమ పోస్టర్, బుక్‌లెట్‌ను కావలి వైఎస్ఆర్సిపి మాజీ ఎమెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాలు, వెన్నుపోటు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ పుస్తకాన్ని రూపకల్పన చేశామని, 2024 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ఒక శాతం కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ‘స్త్రీ శక్తి’, ఉచిత సిలిండర్లు, ‘దీపం’, పెన్షన్లు, తల్లికి వందనం అంటూ మహిళలకు పంగనామాలు పెట్టారని, నేడు మహిళలు, నిరుద్యోగులు, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం యూరియా దొరక్క రైతులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారని, మెగా డిఎస్సీ పేరుతో జీవోల మీద జీవోలు మారుస్తూ తప్పులను కప్పిపుచ్చుకునే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. జగనన్న హయాంలో సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి, రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని వసతులు కల్పించామని గుర్తుచేస్తూ, చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీల బాండ్ పేపర్లు కేవలం చలిమంటలు వేసుకోవడానికే పనికొస్తాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని, ఆక్రోశాన్ని తెలియజేయడానికి జూన్ 4వ తేదీన ప్రతి మండలంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టే “వెన్నుపోటుకు రెండు సంవత్సరాలు” నిరసన కార్యక్రమాన్ని ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల లో సాధించింది శూన్యం రెండేళ్ల వెన్నుపోటు ఆవిష్కరణ లో ప్రతాప్ రెడ్డి