Tuesday, 18 August 2026
  • Home  
  • కూటమి ప్రభుత్వంలో రైతే రాజు-గాలి మురళి నాయుడు
- తిరుపతి

కూటమి ప్రభుత్వంలో రైతే రాజు-గాలి మురళి నాయుడు

తొట్టంబేడు, ఆగస్టు 17, (పున్నమి న్యూస్): ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతులకు గరిష్టంగా గిట్టుబాటు ధరను కల్పించడం పట్ల పార్టీలకతీతంగా రైతాంగం అంతా సంతోషాన్ని వ్యక్తపరుస్తోందని టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గాలి మురళి నాయుడు కొనియాడారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలాల్లో రసాయన ఎరువుల (యూరియా) కొరత లేకుండా చూడాలని, ఎలాంటి యాప్‌ల నిబంధనలు లేకుండా నేరుగా పంపిణీ చేయాలని కోరారు. అదేవిధంగా వరి కోత యంత్రాలు, స్ప్రేయర్లు, తార్పాలిన్ పట్టలు, మరియు ఇతర ఆధునిక వ్యవసాయ పరికరాలను లాటరీ (డిప్) పద్ధతి ద్వారా కాకుండా అర్హులైన రైతులందరికీ నేరుగా అందుబాటులోకి తెస్తే అన్నదాతలు మరింత ఆనందం వ్యక్తం చేస్తారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎటువంటి వ్యవసాయ పరికరాలను అందించిన చరిత్రే లేదని ఆయన విమర్శించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎంతో మంది రైతులకు భారీ సబ్సిడీల ద్వారా వ్యవసాయ పనిముట్లను అందించిన ఘనత చంద్రబాబు నాయుడుతో పాటు దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికే దక్కిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.