వార్త ముఖ్యాంశాలు
- జడ్పీటీసీ సిపిఐ అభ్యర్థి రవీంద్రబాబు ను గెలిపించండి!!!
- =============≠=======================పామూరు, నవంబర్ 4(పున్నమి న్యూస్ రిపోర్టర్ )..కనిగిరి మండల సిపిఐ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి యెనుబరి రవీంద్ర బాబు గెలిపు కోసం, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యం.
- యల్.
జడ్పీటీసీ సిపిఐ అభ్యర్థి రవీంద్రబాబు ను గెలిపించండి!!!
=============≠=======================పామూరు, నవంబర్ 4(పున్నమి న్యూస్ రిపోర్టర్ )..కనిగిరి మండల సిపిఐ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి యెనుబరి రవీంద్ర బాబు గెలిపు కోసం, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యం. యల్. నారాయణ విజ్ఞప్తి చేశారు.ఈ సిపిఐ అభ్యర్థి పార్టీ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ,,అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో పాలిస్తున్న కూటమి ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రణ చేయడంలో పూర్తిగా విఫలమైనదని దుయ్యబట్టారు.మధ్యతరగతి ప్రజలు ధరల పెరుగుదలతో పూర్తిగా దిక్కుతోచని పరిస్థితిలో వున్నారని,ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే వేరే రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి వస్తుందని అన్నారు..కూటమి ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ మరియు దళిత ప్రజలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు..మొన్న జరిగిన స్థానిక ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేసి, పోటీకి నిలబడే నామినేషన్ పత్రాలు తిరస్కరించడంతో, మండల స్థాయిలోని ప్రజలు చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం తప్పా, ఏమి చేయలేని పరిస్థితి..కావున ఇలాంటి విష సంసృతికి స్వస్తి చెప్పి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది..