కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి
కుసుమంచి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టుసింగారం డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసుల సమస్యలపై టీడీఎఫ్ ఖమ్మం జిల్లా ఇన్చార్జి ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, గతంలో కేటాయించిన విధంగా మిగిలిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.


