పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.
కావలి పట్టణంలోని 37వ వార్డులో ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. అధికారుల, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడారు.
జగనన్న కాలనీ పట్టాలు ఇచ్చినా స్థలం చూపించలేదని పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.



