డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం కాపవరం గ్రామంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ రూ.3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ తాగునీటి ప్లాంట్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. జాబ్ మేళాలు, విద్యా సహాయం, వైద్య సేవలు, డయాలసిస్ యూనిట్, ఫిజియోథెరపీ పరికరాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలతో ఫౌండేషన్ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. వాసంశెట్టి సత్యం నాయకత్వంలో చేపడుతున్న సేవలను గ్రామ ప్రజలు, నాయకులు అభినందించారు.



