తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు అండగా నిలిచే చర్యలపై చర్చ జరిగినట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే అంశంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ శ్రేణుల పరిస్థితి, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అంశాలపై సమాలోచనలు జరిగినట్లు సమాచారం. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చర్చించినట్లు సమాచారం.

తాడేపల్లిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గార్కి కలిసిన గన్నవరపు శ్రీనివాసరావు