Thursday, 1 October 2026
  • Home  
  • కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు 5 సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు 5 సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ.

వింజమూరు మండల కేంద్రంలోని గంగమిట్ట, బీసీ కాలనీ, అరుంధతివాడ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సతీమణి శ్రీమతి కాకర్ల ప్రవీణ గారు, మాజీ ఎంపీపీ శ్రీమతి వనిపెంట హైమావతి గారు, ఉదయగిరి నియోజకవర్గ మహిళ ప్రధాన కార్యదర్శి శ్రీమతి రేబాల రూపకల గారితో కలిసి 5 సీలింగ్ ఫ్యాన్లను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు.అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా గంగమిట్ట అంగన్వాడీ కేంద్రంలో గత 20 రోజులుగా విద్యుత్ సమస్య ఉందని సిబ్బంది మరియు స్థానికులు శ్రీమతి కాకర్ల ప్రవీణ గారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను తెలుసుకున్న వెంటనే ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని, అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన వసతుల కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, భద్రతకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, అంగన్వాడీ కేంద్రాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

వింజమూరు మండల కేంద్రంలోని గంగమిట్ట, బీసీ కాలనీ, అరుంధతివాడ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సతీమణి శ్రీమతి కాకర్ల ప్రవీణ గారు, మాజీ ఎంపీపీ శ్రీమతి వనిపెంట హైమావతి గారు, ఉదయగిరి నియోజకవర్గ మహిళ ప్రధాన కార్యదర్శి శ్రీమతి రేబాల రూపకల గారితో కలిసి 5 సీలింగ్ ఫ్యాన్లను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు.అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా గంగమిట్ట అంగన్వాడీ కేంద్రంలో గత 20 రోజులుగా విద్యుత్ సమస్య ఉందని సిబ్బంది మరియు స్థానికులు శ్రీమతి కాకర్ల ప్రవీణ గారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను తెలుసుకున్న వెంటనే ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని, అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన వసతుల కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
చిన్నారుల ఆరోగ్యం, విద్య, భద్రతకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, అంగన్వాడీ కేంద్రాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.