ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా కసుమూరు శ్రీ మస్తానయ్య దర్గాలో గంధమహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంధోత్సవానికి విచ్చేసిన సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, డ్రమ్స్ శివమణితో సోమిరెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు. కడప అమీర్ పీర్ దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేని సాహెబ్ ఆశీస్సులు అందుకున్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ సహకారంతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీ మస్తానయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సోమిరెడ్డి ఆకాంక్షించారు.

కసుమూరు దర్గాలో వైభవంగా గంధమహోత్సవం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా కసుమూరు శ్రీ మస్తానయ్య దర్గాలో గంధమహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంధోత్సవానికి విచ్చేసిన సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, డ్రమ్స్ శివమణితో సోమిరెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు. కడప అమీర్ పీర్ దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేని సాహెబ్ ఆశీస్సులు అందుకున్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ సహకారంతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీ మస్తానయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సోమిరెడ్డి ఆకాంక్షించారు.

