మేడ్చల్ (పున్నమి విలేకరి, సందీప్):
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరటనిస్తున్న ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ఎలాంటి షరతులు లేకుండా యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హబ్సిగూడ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ… పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే ఈ పథకాలు ఎంతో మందికి నిలబెట్టే ఆధారంగా మారాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పథకాల అమలులో ఉన్న ఆటంకాలను తొలగించి యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: BRS ధర్నా హబ్సిగూడ చౌరస్తాలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాలతో భారీ నిరసన
మేడ్చల్ (పున్నమి విలేకరి, సందీప్): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరటనిస్తున్న ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ఎలాంటి షరతులు లేకుండా యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హబ్సిగూడ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ… పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే ఈ పథకాలు ఎంతో మందికి నిలబెట్టే ఆధారంగా మారాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పథకాల అమలులో ఉన్న ఆటంకాలను తొలగించి యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు

