శ్రీ కాళహస్తి, జులై 21, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు హరిజనవాడలో గత 80 సంవత్సరాలుగా ప్రత్యేక శ్మశానవాటిక స్థలం, అక్కడికి వెళ్లేందుకు శాశ్వత రహదారి లేకపోవడంపై జనసేన పార్టీ నాయకుడు దండి నరేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక జనసైనికులు, గ్రామ ప్రజల ద్వారా సమస్యను తెలుసుకున్న ఆయన స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మనిషికి గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే అవకాశం కల్పించడం ప్రాథమిక మానవ హక్కని, దశాబ్దాలుగా ఈ కనీస సౌకర్యం లేకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం గ్రామస్తులు అంత్యక్రియల కోసం దూర ప్రాంతాలకు వెళ్తూ, వ్యవసాయ పొలాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన చట్టబద్ధమైన విధానాలపై గ్రామస్తులకు మార్గనిర్దేశం చేయగా, వారంతా ఏకాభిప్రాయంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ సహకారంతో కమ్మకొత్తూరు హరిజనవాడకు ప్రత్యేక శ్మశానవాటిక స్థలం, శాశ్వత రహదారి ఏర్పాటు జరిగేలా సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ తన వంతు కృషి చేస్తానని దండి నరేంద్ర స్పష్టం చేశారు.

కమ్మకొత్తూరులో 80 ఏళ్లుగా లేని శ్మశాన వాటిక, రోడ్డు సౌకర్యం-జనసేన నేత దండి నరేంద్ర