వార్త ముఖ్యాంశాలు
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలోని 11 మండలాల కౌంటింగ్ కేంద్రాల్లో మండలాల వారీగా ప్రత్యేక మీడియా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంతి టి., ఐఏఎస్ తెలిపారు.
- కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా మానిటరింగ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ (ఎంసీఎంసీ) ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
- ఈ సందర్భంగా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సబ్ కలెక్టర్ కె.చిరంజీవి నాగ వెంకట సాహిత్, జెడ్పీ సీఈఓ వాసుదేవరావుతో కలిసి కలెక్టరేట్‌లోని ఎంసీఎంసీ మీడియా కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలోని 11 మండలాల కౌంటింగ్ కేంద్రాల్లో మండలాల వారీగా ప్రత్యేక మీడియా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంతి టి., ఐఏఎస్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా మానిటరింగ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ (ఎంసీఎంసీ) ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సబ్ కలెక్టర్ కె.చిరంజీవి నాగ వెంకట సాహిత్, జెడ్పీ సీఈఓ వాసుదేవరావుతో కలిసి కలెక్టరేట్‌లోని ఎంసీఎంసీ మీడియా కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
మీడియా ప్రతినిధులు ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ప్రజలకు వేగంగా, ఖచ్చితమైన సమాచారం అందించేందుకు అవసరమైన సాంకేతిక, సమాచార సదుపాయాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం కౌంటింగ్ కేంద్రాల్లోని మీడియా కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన