Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్

వార్త ముఖ్యాంశాలు

  • కృష్ణ మండల కేంద్రంలోని క్షిరాలింగేశ్వర స్వామి దేవాలయంలో బీజేపీ కృష్ణ మండల శాఖ ఆధ్వర్యంలో దేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ..
  • స్వాతంత్ర్యం అనంతరం 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

కృష్ణ మండల కేంద్రంలోని క్షిరాలింగేశ్వర స్వామి దేవాలయంలో బీజేపీ కృష్ణ మండల శాఖ ఆధ్వర్యంలో దేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుంచి విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయించడంలో ఆయన చూపిన చాకచక్యం, ధైర్యసాహసాలు మరువలేనివని పేర్కొన్నారు. దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు దండు రాఘవేంద్ర, సచిన్ బట్, సీనియర్ నాయకులు డీకే కిష్టప్ప, అజిత్ దీక్షిత్, కె. ఆంజనేయులు, పల్లె రాము తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *