నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్ పేట కు నూతనంగా నియమితులైన ఎస్సై జిలాని దర్గా వద్ద భక్తుల పర్యవేక్షణ కోసం నూతన పద్ధతి అవలంబించారు. మొక్కుబడితో శుక్రవారం భక్తులు ఇక్కడ దర్గా వద్ద నిద్ర చేయడం ఆనవాయితీ. ఇక్కడ భక్తులు నిద్రించే సమయంలో వారి వస్తువుల భద్రత, భక్తుల రక్షణ కోసం ఎస్సై జిలాని ప్రత్యేక సిబ్బందిని పర్యవేక్షణకు నియమించారు.. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఇక్కడ నియమించబడిన ప్రత్యేక సిబ్బంది ఎటువంటి దొంగతనాలు లేదా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షణ చేస్తున్నట్లు నేరాలు జరగకుండా ముందస్తుగా పోలీసుల పహారా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై జిలాని తెలిపారు.. ఇలా ప్రతి శుక్రవారం దర్గా వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఎస్ఐ తెలపడంతో స్థానిక భక్తులు వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు…



