Tuesday, 18 August 2026
  • Home  
  • ఏపీ గ్రీన్ సొసైటీ చైర్మన్‌గా నాగబాబు నియామకంపై కొట్టే సాయి హర్షం
- తిరుపతి

ఏపీ గ్రీన్ సొసైటీ చైర్మన్‌గా నాగబాబు నియామకంపై కొట్టే సాయి హర్షం

శ్రీ కాళహస్తి, ఆగస్టు 17, (పున్నమి న్యూస్): జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమితులవ్వడం పట్ల శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ స్పందిస్తూ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, అడవుల విస్తరణ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఏపీ గ్రీన్ సొసైటీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కొణిదెల నాగబాబు సమర్థవంతమైన నాయకత్వం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్పగించిన ఈ నూతన బాధ్యతల్లో ఆయన మరింతగా రాణించి, రాష్ట్రాన్ని పచ్చదనాల హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. కొణిదెల నాగబాబుకు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులు, వీర మహిళలు, మరియు వేలాది మంది జనసైనికుల తరపున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కొట్టే సాయి ప్రసాద్ ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.