Friday, 29 May 2026
  • Home  
  • ఏజెన్సీ చట్టాలకు తూట్లు: పంట దందామొద్దు నిద్రా వీడని ప్రభుత్వ యంత్రాంగం
- ఖమ్మం

ఏజెన్సీ చట్టాలకు తూట్లు: పంట దందామొద్దు నిద్రా వీడని ప్రభుత్వ యంత్రాంగం

*ఏజెన్సీ చట్టాలకు తూట్లు: పంట దందా* *మొద్దు నిద్రా వీడని ప్రభుత్వ యంత్రాంగం* *పట్టించుకోని అధికారులు, రైతులకు తప్పని మోసం* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 30 గుగులోత్ భావు సింగ్ నాయక్ ఏన్కూరు: 5వ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం, పిసా చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు రైతుల నుండి నేరుగా మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు నిద్రావస్థలో ఉన్నారని గిరిజన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏన్కూరు మండలంలో మార్కెట్ లైసెన్స్ పేరుతో గిరిజనేతరులు గ్రామగ్రామాన తిరుగుతూ పంట కొంటున్నారు. లైసెన్స్ లేని వ్యాపారులు సైతం బేఖాతరుగా దందా సాగిస్తున్నారు. క్వింటాకు రూ.1000 నుండి రూ.2000 వరకు తక్కువ ధరకు కొని, బిల్లులు ఇవ్వకుండా, తూకంలో మోసం చేస్తున్నారు. గత రెండు నెలల్లోనే వేల క్వింటాళ్ల పంట అక్రమంగా తరలిపోయినట్లు సమాచారం *తనిఖీలు శూన్యం:* మార్కెటింగ్ శాఖ, తూనికలు కొలతల శాఖ, ఐటీడీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడం మానేశాయి. ఏజెంట్లకు దళారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వ అధికారులు *మామూళ్ల మత్తు:* “ నెలకు లక్షల మామూళ్లు అందుతున్నందునే అధికారులు కళ్లు మూసుకుంటున్నారు” అని స్థానికంగా బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. *గ్రామసభల నిర్వీర్యం:* పిసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి లేకుండా వ్యాపారం చేయకూడదు. కానీ ఒక్క గ్రామంలో కూడా సభలు నిర్వహించి తీర్మానం చేయించలేదు. గ్రామసభలు నిర్వహించినట్టుగా ఎటువంటి ఆధారాలు కూడా లేవు. కొంతమంది వ్యాపారులు మార్కెట్కు ఫీజు కట్టకుండా జీరో బిల్లులతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. మార్కెట్ కు ప్రతి సంవత్సరం ఇచ్చిన టార్గెట్ దాటిపోయేది. ఈ సంవత్సరం జీరో బిల్లులతో లోడ్లు వెళ్లడంతో మార్కెట్కు ఆదాయం భారీగా తగ్గింది. పిసా చట్టం 1996 గ్రామసభ అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయాలి కానీ ఇప్పటివరకు ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదు *రైతుల గోడు:* జి సి సి కేంద్రం దూరం. వెంటనే డబ్బులు కావాలని వీళ్లకు అమ్ముతున్నాం. కానీ వీళ్లు కిలోకు 2 కిలోలు తరుగు తీస్తున్నారు. అడిగితే బెదిరిస్తున్నారు. అధికారులకు చెబితే ‘మేం ఏం చేస్తాం’ అంటున్నారు” అని ఏన్కూరు మండలం రైతు కన్నీటిపర్యంతమయ్యారు. ఇది కేవలం ఆర్థిక దోపిడీ కాదు, రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్ హక్కులపై దాడి. 48 గంటల్లో అధికారులు స్పందించి అక్రమ వ్యాపారులను అరెస్టు చేయకపోతే ఐటీడీఏ కార్యాలయం ముట్టడిస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి 24 గంటల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దాడులు చేయాలి. అక్రమ వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి, ఆస్తులు జప్తు చేయాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీలో జిసిసి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏజెన్సీలో యథేచ్ఛగా పంట కొంటున్న గిరిజనేతర వ్యాపారులు. పట్టించుకోని అధికార యంత్రాంగం.

*ఏజెన్సీ చట్టాలకు తూట్లు: పంట దందా*

*మొద్దు నిద్రా వీడని ప్రభుత్వ యంత్రాంగం*

*పట్టించుకోని అధికారులు, రైతులకు తప్పని మోసం*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 30
గుగులోత్
భావు సింగ్ నాయక్

ఏన్కూరు:
5వ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం, పిసా
చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు రైతుల నుండి నేరుగా మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు నిద్రావస్థలో ఉన్నారని గిరిజన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏన్కూరు మండలంలో మార్కెట్ లైసెన్స్ పేరుతో గిరిజనేతరులు గ్రామగ్రామాన తిరుగుతూ పంట కొంటున్నారు. లైసెన్స్ లేని వ్యాపారులు సైతం బేఖాతరుగా దందా సాగిస్తున్నారు. క్వింటాకు రూ.1000 నుండి రూ.2000 వరకు తక్కువ ధరకు కొని, బిల్లులు ఇవ్వకుండా, తూకంలో మోసం చేస్తున్నారు. గత రెండు నెలల్లోనే వేల క్వింటాళ్ల పంట అక్రమంగా తరలిపోయినట్లు సమాచారం

*తనిఖీలు శూన్యం:*

మార్కెటింగ్ శాఖ, తూనికలు కొలతల శాఖ, ఐటీడీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడం మానేశాయి.
ఏజెంట్లకు దళారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వ అధికారులు

*మామూళ్ల మత్తు:* “

నెలకు లక్షల మామూళ్లు అందుతున్నందునే అధికారులు కళ్లు మూసుకుంటున్నారు”
అని స్థానికంగా బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

*గ్రామసభల నిర్వీర్యం:*

పిసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి లేకుండా వ్యాపారం చేయకూడదు. కానీ ఒక్క గ్రామంలో కూడా సభలు నిర్వహించి తీర్మానం చేయించలేదు.
గ్రామసభలు నిర్వహించినట్టుగా ఎటువంటి ఆధారాలు కూడా లేవు.

కొంతమంది వ్యాపారులు మార్కెట్కు ఫీజు కట్టకుండా జీరో బిల్లులతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. మార్కెట్ కు ప్రతి సంవత్సరం ఇచ్చిన టార్గెట్ దాటిపోయేది. ఈ సంవత్సరం జీరో బిల్లులతో లోడ్లు వెళ్లడంతో మార్కెట్కు ఆదాయం భారీగా తగ్గింది.
పిసా చట్టం 1996 గ్రామసభ అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయాలి కానీ ఇప్పటివరకు ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదు

*రైతుల గోడు:*

జి సి సి కేంద్రం దూరం. వెంటనే డబ్బులు కావాలని వీళ్లకు అమ్ముతున్నాం. కానీ వీళ్లు కిలోకు 2 కిలోలు తరుగు తీస్తున్నారు. అడిగితే బెదిరిస్తున్నారు. అధికారులకు చెబితే ‘మేం ఏం చేస్తాం’ అంటున్నారు” అని ఏన్కూరు మండలం రైతు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇది కేవలం ఆర్థిక దోపిడీ కాదు, రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్ హక్కులపై దాడి. 48 గంటల్లో అధికారులు స్పందించి అక్రమ వ్యాపారులను అరెస్టు చేయకపోతే ఐటీడీఏ కార్యాలయం ముట్టడిస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
24 గంటల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దాడులు చేయాలి.
అక్రమ వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి, ఆస్తులు జప్తు చేయాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
ప్రతి గ్రామ పంచాయతీలో జిసిసి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి.
ఏజెన్సీలో యథేచ్ఛగా పంట
కొంటున్న గిరిజనేతర వ్యాపారులు. పట్టించుకోని అధికార యంత్రాంగం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.