ఏ ఎస్ పేట 25 పున్నమి ( ప్రతినిధి )
ఏఎస్పేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పిటిఎం (తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాలు) అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ కొలను హైస్కూల్లో ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంఈఓలు పాల్గొనగా, కే. ఎడవల్లిలో ఎంపీడీవో ప్రసన్నకుమారి, టిడిపి నాయకులు మాల్యాద్రి నాయుడు హాజరయ్యారు. చిరమనలో డిప్యూటీ,ఎంపీడీవో మునిరత్నం, టిడిపి నాయకులు శ్రీధర్ పాల్గొన్నారు. ఏఎస్ పేట హైస్కూల్లో వైఎస్సార్ సీపీ నాయకులు సందానీ భాష, కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ శ్రీ దీపు ఆధ్వర్యంలో సమావేశాలు విజయవంతంగా జరిగాయి. ఈ సమావేశాలలో విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, తల్లిదండ్రుల భాగస్వామ్యంపై చర్చించారు.


