
ఎవరు గొప్ప
వెచ్చనైనా విభాప్రభాతముల తాకిడితో మేలుకొలిపి,
జీవన గమనంలో ముందుకు సాగిపోయేలా,
మండుటెండలో రహదారి వెంట నడుస్తూ,
తోడుగా వెంటనడుస్తుంది……పగలు
వెన్నెల వెలుగులు విరజిమ్ముచు ,
చల్లని మంచు తెరల తెమ్మరలను, నింగి నుంచి నేలపైకి విసురుతూ,
తారలోకంలో విహరింప జేస్తుంది……….చీకటి
బోసినవ్వుల పాపాయి
తల్లిహృదయాన్ని హత్తుకున్నట్లు,
అలసి సొలసిన దేహాన్ని
తన ఒడిలోకి చేర్చుకుంటుంది…..నేలతల్లి
ప్రేమాభిమానాలు పంచుతూ,
మంచి,చెడుల తారతమ్యాలను తెలుపుతు,
ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించి,
ఓటమిలో ఓదార్పునిస్తు,
గెలుపులో ఆనందిస్తూ,
పగలు,రాత్రి తేడా లేక,
తనతో చిరకాలం నిలచి ఉంటుంది …….కన్నతల్లి ప్రేమ.
నావూరు. హరి,
ఉపాధ్యాయులు
వెంకటగిరి.

