Tuesday, 8 September 2026
  • Home  
  • ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం

విద్యార్థుల భవిష్యత్‌ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం ఆత్మకూరు, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి): ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్యాబోధన చేయడమే కాకుండా, వారిని ఉన్నత విలువలు, క్రమశిక్షణ, నైతికతతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని డా. ఎస్.ఆర్.జె. డిగ్రీ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌ డా. టి. శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.శనివారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని, విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు మంచి మార్గంలో నడిపించే బాధ్యత కూడా గురువులపై ఉందన్నారు. విద్యార్థులలో ప్రతిభను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ భవిష్యత్‌ లక్ష్యాల వైపు నడిపించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్ధిని విద్యార్దులకు వ్యాసరచనా పోటీలు నిర్వహించారు .విజేతలకు బహుమతులు అందజేశారు .అనంతరం విద్యార్థులు తమ గురువులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను కొనియాడారు. ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులు ఆశీర్వాదాలు, విలువైన సూచనలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సుప్రజ ,రమణయ్య,వెంకట్,రవి ,కొండయ్య ,రాజమోహన్ మరియు విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం

ఆత్మకూరు, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి): ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్యాబోధన చేయడమే కాకుండా, వారిని ఉన్నత విలువలు, క్రమశిక్షణ, నైతికతతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని డా. ఎస్.ఆర్.జె. డిగ్రీ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌ డా. టి. శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.శనివారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని, విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు మంచి మార్గంలో నడిపించే బాధ్యత కూడా గురువులపై ఉందన్నారు. విద్యార్థులలో ప్రతిభను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ భవిష్యత్‌ లక్ష్యాల వైపు నడిపించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్ధిని విద్యార్దులకు వ్యాసరచనా పోటీలు నిర్వహించారు .విజేతలకు బహుమతులు అందజేశారు .అనంతరం విద్యార్థులు తమ గురువులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను కొనియాడారు. ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులు ఆశీర్వాదాలు, విలువైన సూచనలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సుప్రజ ,రమణయ్య,వెంకట్,రవి ,కొండయ్య ,రాజమోహన్ మరియు విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.