Saturday, 15 August 2026
  • Home  
  • ఉద్యోగ ఖాళీలను 20 వేలకు పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
- మంచిర్యాల

ఉద్యోగ ఖాళీలను 20 వేలకు పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు (టీవీయూవీ, జీవీఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లిలోని బీసీ వసతి గృహం ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల వంశీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే అనేక ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో వయోపరిమితి, ఆర్థిక ఇబ్బందులు, పోటీ పరీక్షలకు నిరంతరం సిద్ధమవుతున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ఖాళీలను సమగ్రంగా సమీక్షించి, ఉద్యోగాల సంఖ్యను కనీసం 20,000కు పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గుర్తించి వాటి వివరాలను పారదర్శకంగా ప్రకటించడంతో పాటు, భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను కూడా దశలవారీగా భర్తీ చేసే విధంగా స్పష్టమైన ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, నిరుద్యోగుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సామాజిక బాధ్యతతో పరిష్కరించాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడటం మానుకోవాలని, తక్షణమే సంబంధిత శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించి 20 వేల ఉద్యోగ ఖాళీలతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, నిరుద్యోగులను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ , విద్యార్థి నాయకులు అభిరామ్, సంతోష్, హరీష్, మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.