వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది.
- వాహనాల రద్దీ పెరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పంచాయతీ బస్టాండ్‌లో నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతోంది.
ఉదయగిరి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. వాహనాల రద్దీ పెరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పంచాయతీ బస్టాండ్‌లో నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతోంది. సాయంత్రం వేళల్లో సమస్య ఎక్కువగా ఉంటుండటంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పోలీసుల నిరంతర పర్యవేక్షణ, బస్సుల పార్కింగ్‌పై నియంత్రణ ఉంటే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.