ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి)
యాచవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కుడముల సుజన ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా ఎంపికయ్యారు. ఆగస్టు 15న నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ చేతుల మీదుగా ఆమె ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన సమక్షంలో అవార్డు ప్రదానం జరిగింది. చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో సుజన అందించిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు. ఆమెకు అధికారులు, తోటి అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా కుడముల సుజన
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి) యాచవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కుడముల సుజన ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా ఎంపికయ్యారు. ఆగస్టు 15న నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ చేతుల మీదుగా ఆమె ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన సమక్షంలో అవార్డు ప్రదానం జరిగింది. చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో సుజన అందించిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు. ఆమెకు అధికారులు, తోటి అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

