*ప్రభుత్వ పాఠశాలలా కూటమి పార్టీ ఆఫీసులా…!!!*
*పాఠశాలలను రాజకీయ కేంద్రాలుగా మార్చిన నాయకులు*
*ఎస్ఎంసి ఎన్నికలలో అధికార పార్టీ నాయకుల జోక్యం దురదృష్టకరం…!*
_వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు_
ఎస్ఎంసి ఎన్నికలు అధికార పార్టీ నాయకుల జోక్యం రాజకీయ పార్టీ కేంద్రాలుగా మార్చడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం విద్యార్థుల తల్లిదండ్రులను కమిటీగా ఎన్నుకునేటటువంటి ఎస్ఎంసి ఎన్నికలలో కూటమి పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొనడం వారి రాజకీయ పిచ్చి పరాకాష్టకు చేరిందనే దానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. వారి ప్రమేయంతో పాఠశాలలను కూటమి పార్టీ కార్యాలయాలుగా మార్చారని అన్నారు. ఆధిపత్యం కోసం ప్రలోభాలకు దిగజారటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేటటువంటి పాఠశాలలలో కూటమి పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల జోక్యంతో నేడు అనేక ప్రభుత్వ పాఠశాలలలో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఎస్ఎంసి ఎన్నికలు వాయిదా పడ్డాయి. తెలుగుదేశం మరియు కూటమి పార్టీలు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచక పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నాడు పాఠశాలలను అత్యంత ప్రాధానమిచ్చి అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కూటమి నాయకులు ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.




