Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరం: మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరం: మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం

వార్త ముఖ్యాంశాలు

  • *పార్టీ కోసం ఆస్తులమ్మి సర్వస్వం అంకితం చేశాం..
  • నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా ఎమ్మెల్యే విజయశ్రీయే చూసుకుంటారు* సూళ్లూరుపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
  • తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడారు.

*పార్టీ కోసం ఆస్తులమ్మి సర్వస్వం అంకితం చేశాం.. నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా ఎమ్మెల్యే విజయశ్రీయే చూసుకుంటారు*

సూళ్లూరుపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, పార్టీ కోసం తాను చేసిన త్యాగాలు, అలాగే తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన సుదీర్ఘంగా స్పష్టతనిచ్చారు.

*పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమ:*
2014 నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ కోసం నిర్భర్తతో పనిచేశానని సుబ్రహ్మణ్యం గుర్తుచేశారు. ముఖ్యంగా 2019లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవడానికి అనేక పోరాటాలు, ధర్నాలు నిర్వహించామని, నారా లోకేష్ బాబు పాదయాత్రను విజయవంతం చేయడంలో మేముండి నడిచామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల కోసం ఎవరిపై ఆర్థిక భారం మోపకుండా, సొంత ఖర్చులతోనే అన్ని సమకూర్చుకున్నానని వెల్లడించారు.

*రాజకీయ పునర్న్యాసం – త్యాగాలు:*
2024 ఎన్నికల్లో తన కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించినప్పుడు, ఎన్నికల నిర్వహణ కోసం తనకున్న ఆస్తులు, భూములను సైతం అమ్మి పార్టీ విజయానికి కృషి చేశామని సుబ్రహ్మణ్యం తెలిపారు. అదేవిధంగా 2024లో చంద్రబాబు ఆదేశానుసారం తాను ఎంపీగా గెలవడం తమ కుటుంబానికి రాజకీయ పునర్జన్మ లాంటిదని, ఆ రుణం తీర్చుకోలేనిదని వెర్కొన్నారు.

*నిరాధార ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం:*
పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి సూచన మేరకు తాను పార్టీ మరియు నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించామని తెలిపారు. అయితే కొందరు కావాలనే తనపై ఇసుక అక్రమ రవాణా వంటి నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన జీవితంలో ఎప్పుడూ అలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.

*రాజకీయాలకు స్వస్తి – కుటుంబానికే పరిమితం:*
ఇకపై తాను ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాల్లోనూ జోక్యం చేసుకోబోనని, నియోజకవర్గ బాధ్యతలన్నీ ఎమ్మెల్యే ఆయన తన కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీయే పూర్తిగా చూసుకుంటారని తెల్చిచెప్పారు. దయచేసి తనను అనవసర రాజకీయ విమర్శలు మరియు వివాదాల్లోకి లాగొద్దని, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించనివ్వాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే పార్టీని ముందుకు నడిపించామని, ఇకపై పూర్తిగా కుటుంబానికే పరిమితమని వెల్లడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *