వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
*ఆర్నబ్ తుఫాన్ హెచ్చరిక.. పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవులు!*
*కాకినాడను తాకే అవకాశం.. 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే సూచన*
* ఆర్నబ్ తుఫాన్ కాకినాడ జిల్లాను తాకే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. హరిందర ప్రసాద్ సూచించారు. తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు.
– జిల్లాలో ఆరు తుఫాన్ కేంద్రాలను సిద్ధం చేశామని, తీర ప్రాంత ప్రజలను మంగళవారం ఉదయం సైక్లోన్ షెల్టర్లకు తరలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.మత్స్యకారులను అప్రమత్తం చేసి, సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించినట్లు పేర్కొన్నారు.
– గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో 24 గంటల పాటు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు:*
📞 08842356801
📞 9849903879
Uploaded Video:
వార్తా మూలాలు
- Publicationపత్రికా ప్రకటన