అనకాపల్లి జిల్లా, ఆగస్టు 4 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి–శిశు ఆరోగ్య సంరక్షణ, శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే అమూల్యమైన వరమని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ జి. అపరంజిని, సీహెచ్ఓ కృష్ణవేణి, మహిళా పోలీసు శైలజ మాట్లాడుతూ ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గర్భిణులు, బాలింతలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలే పునాది – ఏటికొప్పాకలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 4 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి–శిశు ఆరోగ్య సంరక్షణ, శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే అమూల్యమైన వరమని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ జి. అపరంజిని, సీహెచ్ఓ కృష్ణవేణి, మహిళా పోలీసు శైలజ మాట్లాడుతూ ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గర్భిణులు, బాలింతలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

