Tuesday, 14 July 2026
  • Home  
  • ఆరోగ్యం క్షీణించి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుర్మిద్ద పల్లె దవాఖానా..!
- News

ఆరోగ్యం క్షీణించి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుర్మిద్ద పల్లె దవాఖానా..!

ఆరోగ్యం క్షీణించి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుర్మిద్ద పల్లె దవాఖానా..! “నన్ను కాపాడండి” అని గగ్గోలు పెడుతున్న ప్రభుత్వ ఆస్పత్రి – పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు, ఆరోగ్యశాఖపై సీపీఎం ఆగ్రహం యాచారం మండలం, కుర్మిద్ద గ్రామం: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారుతున్నాయని సీపీఎం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలోని పల్లె దవాఖానాను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించగా అక్కడి పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని తెలిపారు. ఈ పరిశీలనలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి. అంజయ్య, సీపీఎం శాఖ కార్యదర్శి, 8వ వార్డు సభ్యుడు ఎం. సురేష్, సీనియర్ నాయకుడు ఎం. జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి ఆవరణను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పి. అంజయ్య, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఈ పల్లె దవాఖానాలో డాక్టర్ ఆస్పత్రి పక్కనే నివాసం ఉండేవారని, గ్రామ ప్రజలకు ఎప్పుడైనా వైద్య సేవలు అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రక్షణ లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, అసౌకర్యాల కారణంగా వైద్యులు బదిలీ కోరుకుని వెళ్లిపోయారని తెలిపారు. అప్పటి నుంచి శాశ్వత డాక్టర్ లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రస్తుతం ఏఎన్‌ఎం వారానికి కేవలం సోమవారం, బుధవారం మాత్రమే విధులకు వస్తోందని, మిగిలిన రోజుల్లో ఆశా వర్కర్లు తమ గ్రామ బాధ్యతలతో పాటు ఆస్పత్రిలో కూడా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి విషపాములు, తేళ్ల భయంతో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనం కూడా ఇవ్వకుండా కేవలం రూ.9,500 మాత్రమే చెల్లించడం దారుణమని విమర్శించారు. పల్లె దవాఖానా భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఎప్పుడో నిర్మించిన గదుల గోడలకు పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయని, రెండు గదుల మధ్య ఖాళీ ప్రదేశంలో భారీ చెట్లు పెరిగి పాములకు స్థావరంగా మారాయని తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణమంతా చెత్తాచెదారంతో నిండిపోయి, పొదలు పెరిగిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఆస్పత్రికి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పందులు, కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, విద్యుత్ సరఫరా సరిగా లేక స్విచ్‌బోర్డులు, వైరింగ్ పూర్తిగా పాడైపోయాయని తెలిపారు. బాత్రూములు పూర్తిగా మురికిగా మారి నీటి సౌకర్యం లేక ఉపయోగించలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. కిటికీలకు తేనెటీగల గూళ్లు ఏర్పడి, గదుల్లో విషపాములు, తేళ్లు సంచరిస్తుండడంతో రోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. తాగునీటి సంప్‌కు మూత లేకపోవడంతో గతంలో ఒక కుక్క అందులో చనిపోయి వారం రోజుల పాటు అలాగే ఉండిపోయినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికీ పందులు, కుక్కలు అదే సంప్‌లోని నీటిని తాగుతున్నాయని, ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని సీపీఎం నాయకులు విమర్శించారు. కుర్మిద్ద పల్లె దవాఖానా పరిస్థితి రాష్ట్రంలోని పల్లె దవాఖానాల దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO), ఆరోగ్యశాఖ మంత్రి ఇప్పటికైనా కళ్లుతెరిచి గ్రామీణ ఆస్పత్రులను స్వయంగా సందర్శించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చొని నివేదికలు చూసే బదులు గ్రామాలకు వచ్చి వాస్తవ పరిస్థితులు పరిశీలించాలని కోరారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అప్పుల పాలై చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులే ప్రజలకు దిక్కు కావాల్సి ఉండగా అవే నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. కుర్మిద్ద పల్లె దవాఖానాలో వెంటనే శాశ్వత వైద్యుడిని నియమించాలని, పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, కొత్త భవనం నిర్మించాలని, ప్రహరీ గోడ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, ఔషధాల సరఫరా వంటి మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇకపై కూడా నిర్లక్ష్యం కొనసాగిస్తే గ్రామ ప్రజలను కలిసి సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, అర్జున్, శివ తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యం క్షీణించి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుర్మిద్ద పల్లె దవాఖానా..!

“నన్ను కాపాడండి” అని గగ్గోలు పెడుతున్న ప్రభుత్వ ఆస్పత్రి – పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు, ఆరోగ్యశాఖపై సీపీఎం ఆగ్రహం

యాచారం మండలం, కుర్మిద్ద గ్రామం:
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారుతున్నాయని సీపీఎం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలోని పల్లె దవాఖానాను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించగా అక్కడి పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని తెలిపారు.
ఈ పరిశీలనలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి. అంజయ్య, సీపీఎం శాఖ కార్యదర్శి, 8వ వార్డు సభ్యుడు ఎం. సురేష్, సీనియర్ నాయకుడు ఎం. జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి ఆవరణను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పి. అంజయ్య, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఆయన మాట్లాడుతూ గతంలో ఈ పల్లె దవాఖానాలో డాక్టర్ ఆస్పత్రి పక్కనే నివాసం ఉండేవారని, గ్రామ ప్రజలకు ఎప్పుడైనా వైద్య సేవలు అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రక్షణ లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, అసౌకర్యాల కారణంగా వైద్యులు బదిలీ కోరుకుని వెళ్లిపోయారని తెలిపారు. అప్పటి నుంచి శాశ్వత డాక్టర్ లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రస్తుతం ఏఎన్‌ఎం వారానికి కేవలం సోమవారం, బుధవారం మాత్రమే విధులకు వస్తోందని, మిగిలిన రోజుల్లో ఆశా వర్కర్లు తమ గ్రామ బాధ్యతలతో పాటు ఆస్పత్రిలో కూడా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి విషపాములు, తేళ్ల భయంతో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనం కూడా ఇవ్వకుండా కేవలం రూ.9,500 మాత్రమే చెల్లించడం దారుణమని విమర్శించారు.
పల్లె దవాఖానా భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఎప్పుడో నిర్మించిన గదుల గోడలకు పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయని, రెండు గదుల మధ్య ఖాళీ ప్రదేశంలో భారీ చెట్లు పెరిగి పాములకు స్థావరంగా మారాయని తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణమంతా చెత్తాచెదారంతో నిండిపోయి, పొదలు పెరిగిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు.
ఆస్పత్రికి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పందులు, కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, విద్యుత్ సరఫరా సరిగా లేక స్విచ్‌బోర్డులు, వైరింగ్ పూర్తిగా పాడైపోయాయని తెలిపారు. బాత్రూములు పూర్తిగా మురికిగా మారి నీటి సౌకర్యం లేక ఉపయోగించలేని పరిస్థితి నెలకొన్నదన్నారు.
కిటికీలకు తేనెటీగల గూళ్లు ఏర్పడి, గదుల్లో విషపాములు, తేళ్లు సంచరిస్తుండడంతో రోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. తాగునీటి సంప్‌కు మూత లేకపోవడంతో గతంలో ఒక కుక్క అందులో చనిపోయి వారం రోజుల పాటు అలాగే ఉండిపోయినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికీ పందులు, కుక్కలు అదే సంప్‌లోని నీటిని తాగుతున్నాయని, ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పని పేర్కొన్నారు.
ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని సీపీఎం నాయకులు విమర్శించారు. కుర్మిద్ద పల్లె దవాఖానా పరిస్థితి రాష్ట్రంలోని పల్లె దవాఖానాల దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO), ఆరోగ్యశాఖ మంత్రి ఇప్పటికైనా కళ్లుతెరిచి గ్రామీణ ఆస్పత్రులను స్వయంగా సందర్శించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చొని నివేదికలు చూసే బదులు గ్రామాలకు వచ్చి వాస్తవ పరిస్థితులు పరిశీలించాలని కోరారు.
పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అప్పుల పాలై చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులే ప్రజలకు దిక్కు కావాల్సి ఉండగా అవే నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు.
కుర్మిద్ద పల్లె దవాఖానాలో వెంటనే శాశ్వత వైద్యుడిని నియమించాలని, పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, కొత్త భవనం నిర్మించాలని, ప్రహరీ గోడ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, ఔషధాల సరఫరా వంటి మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు.
అధికారులు ఇకపై కూడా నిర్లక్ష్యం కొనసాగిస్తే గ్రామ ప్రజలను కలిసి సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మహేందర్, అర్జున్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.