ఖమ్మం: పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద నూతనంగా ఆధునీకరించిన టీ.జీ.ఎన్.పీ.డీ.సీ.ఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్యాలయాల ఆధునీకరణతో విద్యుత్ శాఖ సేవలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


