Saturday, 30 May 2026
  • Home  
  • ఆత్మకూరు నూతన ఎస్సై జంపనీ కుమార్‌కు మర్యాదపూర్వక శుభాకాంక్షలు
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు నూతన ఎస్సై జంపనీ కుమార్‌కు మర్యాదపూర్వక శుభాకాంక్షలు

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా బాధ్యతలు స్వీకరించిన జంపనీ కుమార్‌ను శనివారం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి పులిమి శైలజా రెడ్డి, ఆత్మకూరు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, ఆత్మకూరు తెలుగు యువత మాజీ అధ్యక్షుడు చెరుకూరు తిరుపతి నాయుడు కలిసి నూతన ఎస్సై జంపనీ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఆత్మకూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్సై జంపనీ కుమార్ మాట్లాడుతూ, ఆత్మకూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.అనంతరం నాయకులు ఎస్సై జంపనీ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.