Friday, 4 September 2026
  • Home  
  • అయ్యా మంత్రిగారు సోమశిల ఆత్మకూరు రోడ్డు కొత్త రోడ్డు వేయండి…..సిపిఎం పార్టీ నిరసన,రాస్తా రోకో
- E-పేపర్

అయ్యా మంత్రిగారు సోమశిల ఆత్మకూరు రోడ్డు కొత్త రోడ్డు వేయండి…..సిపిఎం పార్టీ నిరసన,రాస్తా రోకో

సోమశిల ఆత్మకూరు రోడ్డు గోతులతో ఉండటంతో కొత్త రోడ్డు వేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో *అయ్యా మంత్రి గారు సోమశిల ఆత్మకూరు కొత్త రోడ్డు నిర్మాణం చేయాలని అనంతసాగరం మండల కేంద్రం తాజ్ కేఫ్ సెంటర్ వద్ద నిరసన , రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.* ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి అయిన ఇప్పటివరకు రోడ్ల పై ఉండే గుంతలో ఒక తట్టమట్టి కూడా వేయలేదని అన్నారు.ఎన్నికల గెలవడం కోసం అధికారంలోకి వచ్చిన 6నెలలో రోడ్లు వేస్తామని ఇచ్చిన హామీ అమలుచేయలేదు, సోమశిల ఆత్మకూరు రోడ్డు గోతులతో ఉన్నదని ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకం కనబడుతున్నది అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు సోమశిల జలాశయం నీటిని విడుదల చేసేటప్పుడు గోతులు లేని హైవే రోడ్లు మీద వచ్చి వెళుతున్నారని ఒక్కసారి మంత్రిగారు ఆత్మకూరు నుండి సోమశిలకు ఈ భయంకరమైన గుంతల రోడ్డు మీద రావాలని మండల ప్రజలు కోరుతున్నారని అన్నారు.వర్షాలకు రోడ్డు మీద ఉండే గుంతలో నీళ్లు నిలబడి ఉండటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.ఆనం అంటే అభివృధి అంటారు ఈ రోడ్డు చూస్తేనే అభివృద్ధి కనబడుతుందని అన్నారు.మంత్రి గారు తక్షణమే స్పందించి సోమశిల ఆత్మకూరు కొత్త రోడ్డు వేయాలని, అలాగే వర్షాల సమయంలో ముత్తుకూరు, కమ్మవారి పల్లి వాగులలో నీళ్ళు నిలబడి ఉండటం వలన ప్రయాణికులు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ఉన్నదని వాటిమీద బ్రిడ్జిలు నిర్మించాలని అన్నారు.లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీల ను ఐక్యం చేసి రోడ్ల సమస్య మీద పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం అనంతసాగరం కార్యదర్శి జక్రయ్య, సిపిఎం పార్టీ సభ్యులు ఫక్రూసా,నాగులూరు వెంకటేష్, సందాని,లక్ష్మయ్య, నరసింహులు మరియు ఆటో కార్మిక సంఘం CITU అనంతసాగరం మండల అధ్యక్షులు నాయబ్ జానీ, కార్యదర్శి మస్తాన్,ఆటో కార్మికులు పాల్గొన్నారు.

సోమశిల ఆత్మకూరు రోడ్డు గోతులతో ఉండటంతో కొత్త రోడ్డు వేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో *అయ్యా మంత్రి గారు సోమశిల ఆత్మకూరు కొత్త రోడ్డు నిర్మాణం చేయాలని అనంతసాగరం మండల కేంద్రం తాజ్ కేఫ్ సెంటర్ వద్ద నిరసన , రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.*
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి అయిన ఇప్పటివరకు రోడ్ల పై ఉండే గుంతలో ఒక తట్టమట్టి కూడా వేయలేదని అన్నారు.ఎన్నికల గెలవడం కోసం అధికారంలోకి వచ్చిన 6నెలలో రోడ్లు వేస్తామని ఇచ్చిన హామీ అమలుచేయలేదు, సోమశిల ఆత్మకూరు రోడ్డు గోతులతో ఉన్నదని ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకం కనబడుతున్నది అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు సోమశిల జలాశయం నీటిని విడుదల చేసేటప్పుడు గోతులు లేని హైవే రోడ్లు మీద వచ్చి వెళుతున్నారని ఒక్కసారి మంత్రిగారు ఆత్మకూరు నుండి సోమశిలకు ఈ భయంకరమైన గుంతల రోడ్డు మీద రావాలని మండల ప్రజలు కోరుతున్నారని అన్నారు.వర్షాలకు రోడ్డు మీద ఉండే గుంతలో నీళ్లు నిలబడి ఉండటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.ఆనం అంటే అభివృధి అంటారు ఈ రోడ్డు చూస్తేనే అభివృద్ధి కనబడుతుందని అన్నారు.మంత్రి గారు తక్షణమే స్పందించి సోమశిల ఆత్మకూరు కొత్త రోడ్డు వేయాలని, అలాగే వర్షాల సమయంలో ముత్తుకూరు, కమ్మవారి పల్లి వాగులలో నీళ్ళు నిలబడి ఉండటం వలన ప్రయాణికులు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ఉన్నదని వాటిమీద బ్రిడ్జిలు నిర్మించాలని అన్నారు.లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీల ను ఐక్యం చేసి రోడ్ల సమస్య మీద పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం అనంతసాగరం కార్యదర్శి జక్రయ్య, సిపిఎం పార్టీ సభ్యులు ఫక్రూసా,నాగులూరు వెంకటేష్, సందాని,లక్ష్మయ్య, నరసింహులు మరియు ఆటో కార్మిక సంఘం CITU అనంతసాగరం మండల అధ్యక్షులు నాయబ్ జానీ, కార్యదర్శి మస్తాన్,ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.