పేదల ఆకలి తీర్చే గొప్ప పథకంగా పేరుగాంచిన అన్నా క్యాంటీన్ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఒకే రోజు ₹76 లక్షలను అన్నా క్యాంటీన్లకు అందించడం శుభపరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 32వ డివిజన్ డైకాస్ రోడ్డు సెంటర్‌లో జరిగిన భోజన వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అన్నా క్యాంటీన్లను మూసివేయడం పేదలకు అన్యాయమని విమర్శించారు.
అన్నా క్యాంటీన్లు సమర్థవంతంగా కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నా క్యాంటీన్‌లో భోజన వితరణ – సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా
పేదల ఆకలి తీర్చే గొప్ప పథకంగా పేరుగాంచిన అన్నా క్యాంటీన్ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఒకే రోజు ₹76 లక్షలను అన్నా క్యాంటీన్లకు అందించడం శుభపరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 32వ డివిజన్ డైకాస్ రోడ్డు సెంటర్‌లో జరిగిన భోజన వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అన్నా క్యాంటీన్లను మూసివేయడం పేదలకు అన్యాయమని విమర్శించారు. అన్నా క్యాంటీన్లు సమర్థవంతంగా కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

