Wednesday, 29 July 2026
  • Home  
  • అనపర్తిలో టీడీపీ పగ్గాలు నల్లమిల్లి మనోజ్ రెడ్డికి.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మనోజ్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

అనపర్తిలో టీడీపీ పగ్గాలు నల్లమిల్లి మనోజ్ రెడ్డికి.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మనోజ్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమిల్లి

వెలగపూడి, జూలై 28 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డిని నియమించిన సందర్భంగా ఆయనతో పాటు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నల్లమిల్లి మనోజ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అనపర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మనోజ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మనోజ్ రెడ్డి వివరించారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

వెలగపూడి, జూలై 28 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డిని నియమించిన సందర్భంగా ఆయనతో పాటు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నల్లమిల్లి మనోజ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అనపర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మనోజ్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మనోజ్ రెడ్డి వివరించారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.