ముద్దనూరు: గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తిం చేందుకు ప్రభుత్వం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఉప్పలూరు ఉన్నత పాఠశాల మైదానంలో బుధ వారం ప్రధానోపాధ్యాయులు రఘురామయ్య ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎంఇఒ నాగేశ్వర నాయక్ పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ అండర్-14,17 విభాగంలో బాల, బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, యోగ, షటిల్ బ్యాట్ మెంట్ పోటీలు నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన 260 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నట్లు ఎంఇఒ తెలిపారు. విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి తాలూకాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలు శనివారం జమ్మలమడుగులో జరగనున్న తాలూకా పోటీల్లో పాల్గొననున్నట్లు ఎంఇఒ తెలిపారు. క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాలకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు కల్పన, ప్రజలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అట్టహాసంగా మండల స్థాయి క్రీడా పోటీలు