వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల: స్థానిక అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి.
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ అపుస్మా యూనిట్ ప్రెసిడెంట్ టి.
- అమీర్ భాషా హాజరై, శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధించిన నీతి, ధర్మాలు విద్యార్థులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.పాఠశాల కరస్పాండెంట్ వై.
నంద్యాల: స్థానిక అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ అపుస్మా యూనిట్ ప్రెసిడెంట్ టి. అమీర్ భాషా హాజరై, శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధించిన నీతి, ధర్మాలు విద్యార్థులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.పాఠశాల కరస్పాండెంట్ వై. శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఎం.పీ. లావణ్య, డైరెక్టర్ ఈశ్వర్ చంద్ర, ఏఓ మానస మాట్లాడూతూ.. విద్యార్థులు చదువుతో పాటు ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధికల వేషధారణలతో అలరించగా, కృష్ణుడి జీవిత విశేషాలపై ప్రదర్శించిన స్కిట్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో స్కూల్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.