బహుజన టీచర్స్ ఫెడరేషన్(BTF) తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవం
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 14/04/2026*
ఈ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బహుజన టీచర్స్ ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య మరియు ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వడ్డేమాన్ బాల పేరు, జై పవన్ కుమార్, మేడం విజయ్ కుమార్, సత్తయ్య, ఉపాధ్యక్షులు కాజన్నా, ఈశ్వరయ్య, మహిళా సెక్రటరీ శ్రీదేవి నీలియ నాయక్, నర్సింలు మొదలగు జిల్లా సభ్యులు రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు


