అనకాపల్లి జిల్లా, జూలై 2 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
ఏటికొప్పాక గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో నిత్యవార అన్నసమారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించే సేవా కార్యక్రమానికి కర్రి పాండురంగ – రమణమ్మ దంపతులు దాతలుగా వ్యవహరించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
సాయినాథుని ఆశీస్సులతో నిర్వహించిన ఈ అన్నసమారాధనలో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో కరణం శిరీష, అన్నం లక్ష్మి, బీజేపీ నాయకులు శెన్నాంశెట్టి శ్రీను, నాగిరెడ్డి సత్యనారాయణ, మొల్లెట్టి ప్రసాద్, దారా నూకరాజు, కొత్తవల సత్యవతి, అప్పికొండ ప్రభ, సారిపిరెడ్డి నారాయణమ్మ, శెన్నాంశెట్టి లక్ష్మి, దావేటి లక్ష్మి, ఉగ్గిన బాబ్జి, దావేటి సురేష్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ, సాయిబాబా సన్నిధిలో నిర్వహిస్తున్న నిత్యవార అన్నసమారాధన ఎంతో పుణ్యప్రదమైన సేవ అని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు.



