Friday, 5 June 2026
  • Home  
  • హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ర్యాలీ, మానవహారం నిర్వహించి టీడీపీ మేనిఫెస్టో ప్రతుల దహనం ఆత్మకూరు, జూన్ 4 ( హరికిరణ్ , పున్నమి ప్రతినిధి ): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆత్మకూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ డిపో, ఎల్‌ఆర్‌పల్లి, పోలీస్‌స్టేషన్ రోడ్ మీదుగా సోమశిల రోడ్ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేశారు.అనంతరం సోమశిల రోడ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించి, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు, ఎన్నికల హామీలకు సంబంధించిన బాండ్లను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించేందుకు కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.    పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు ప్రత్యేక పథకాలు, ‘తల్లికి వందనం’ వంటి హామీలను కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ప్రకటించారని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఆ హామీలలో చాలా వరకు అమలు కాలేదని వారు ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేదన్నారు.రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని, రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు.ఎన్నికల మేనిఫెస్టోను కేవలం ఓట్లు సాధించడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీకి ప్రజల ఆదరణ మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పంచాయతీ విభాగ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, మున్సిపల్ విభాగ కన్వీనర్ చెరుకూరు కామాక్షయ్యనాయుడు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ఆండ్రా సుబ్బారెడ్డి, తోడేటి మణి, ఇందూరు సురేంద్రరెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కల్పనా రెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ రహీం, బత్తిన నారాయణరెడ్డి, గడ్డం శ్రీనివాసులరెడ్డి, పాలేటి వెంగళరెడ్డి, కొప్పోలు వెంకటేశ్వర్లు, తోడేటి అశోక్, బొలిగర్ల వెంకటేశ్వర్లు, బొడ్డు గిరినాయుడు, బాలచెన్నయ్య, జనార్థన్‌రెడ్డి, గడ్డం దిలీప్, షేక్ ఖాజామస్తాన్, మల్లికార్జున, కృష్ణారెడ్డి, యాకసిరి మల్లెంకొండయ్య, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు

ర్యాలీ, మానవహారం నిర్వహించి టీడీపీ మేనిఫెస్టో ప్రతుల దహనం

ఆత్మకూరు, జూన్ 4 ( హరికిరణ్ , పున్నమి ప్రతినిధి ): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆత్మకూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ డిపో, ఎల్‌ఆర్‌పల్లి, పోలీస్‌స్టేషన్ రోడ్ మీదుగా సోమశిల రోడ్ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేశారు.అనంతరం సోమశిల రోడ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించి, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు, ఎన్నికల హామీలకు సంబంధించిన బాండ్లను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించేందుకు కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

   పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు ప్రత్యేక పథకాలు, ‘తల్లికి వందనం’ వంటి హామీలను కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ప్రకటించారని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఆ హామీలలో చాలా వరకు అమలు కాలేదని వారు ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేదన్నారు.రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని, రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు.ఎన్నికల మేనిఫెస్టోను కేవలం ఓట్లు సాధించడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీకి ప్రజల ఆదరణ మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పంచాయతీ విభాగ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, మున్సిపల్ విభాగ కన్వీనర్ చెరుకూరు కామాక్షయ్యనాయుడు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ఆండ్రా సుబ్బారెడ్డి, తోడేటి మణి, ఇందూరు సురేంద్రరెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కల్పనా రెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ రహీం, బత్తిన నారాయణరెడ్డి, గడ్డం శ్రీనివాసులరెడ్డి, పాలేటి వెంగళరెడ్డి, కొప్పోలు వెంకటేశ్వర్లు, తోడేటి అశోక్, బొలిగర్ల వెంకటేశ్వర్లు, బొడ్డు గిరినాయుడు, బాలచెన్నయ్య, జనార్థన్‌రెడ్డి, గడ్డం దిలీప్, షేక్ ఖాజామస్తాన్, మల్లికార్జున, కృష్ణారెడ్డి, యాకసిరి మల్లెంకొండయ్య, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.